జబర్దస్త్‌గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్‌లో తెగ హంగామా చేశాడు అవినాష్. మరో కంటిస్టెంట్ అరియానాతో క్లోజ్‌గా ఉంటూ పలు అనుమానాలకు ఊతమిచ్చాడు. దీంతో అక్కడే మ్యాటర్ తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ జబర్దస్త్ కమెడియన్ పెళ్లి కానుందని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఈ ఇష్యూ వైరల్ అవుతోంది. అయితే ఈ పరిస్థితుల నడుమ తనకు అనుజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిందంటూ సడెన్ షాకిచ్చాడు అవినాష్. తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ అసలు మ్యాటర్ రివీల్ చేశాడు. అనుజ అనే అమ్మాయితో ఒక్కటి కానుండటం చాలా హ్యాపీగా ఉందని పేర్కొన్నాడు. ఈ ఫొటోస్ చూసి పావులు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతుండగా.. కొందరు మాత్రం ఇది ఫేక్ ఎంగేజ్మెంట్ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా జబర్దస్త్ వర్ష కూడా ఇలాగే పెళ్లి వార్త అంటూ ఆన్ లైన్ హంగామా చేసి చివరకు ఉసూరుమనిపించింది. ఆమె చేసిన హంగామా అంతా ఓ ప్రోగ్రాం కోసమని తర్వాత తెలిసింది. ఆ సందర్భాన్ని మర్చిపోని కొంతమంది నెటిజన్లు విషయంలోనూ అదే అన్వయించుకుంటున్నారు. ఇంతలో ఓ వీడియో బయటకు రావడం, అందులో కూడా , ఆయనకు కాబోయే భార్యను చూపించడం ఆ అనుమానాలకు రెక్కలు కట్టింది. ఈ వినాయక చవితి సందర్భంగా 'పండగే పండగ' ప్రోగ్రాం ప్లాన్ చేసి దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అవినాష్ తనకు కాబోయే భార్యను చూపించడమే గాక.. అందరి ముందే రింగులు తొడిగేసుకున్నారు. దీంతో ఇంతకీ అవినాష్‌ది నిజమైన ఎంగేజ్మెంట్ అని నమ్మొచ్చా లేక ఇది కూడా ప్రోగ్రాం ప్రమోషన్ కోసమేనా అని జనాల్లో డౌట్స్ నెలకొన్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jvxtSS
v
No comments:
Post a Comment