Friday, 27 August 2021

Tuck Jagadish: నాని 'టక్ జగదీష్' రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్

నాని- శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న 'టక్ జగదీష్‌' విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఈ సినిమా విడుదల కోసం ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ కుదుర్చుకుందని వచ్చిన వార్తలను నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీ సెప్టెంబరు 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఈ మేరకు షార్ట్ వీడియో షేర్ చేశారు. 'పండగకి మన ఫ్యామిలీతో.. మీ టక్ జగదీష్' అంటూ నాని పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ''నాయుడు గారి అబ్బాయి చెబుతున్నాడు.. మొదలెట్టండి'' అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు నాని. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక పండగ వేళ ఇంట్లోనే కూర్చొని సినిమా ఎంజాయ్ చేసేయొచ్చు అంటూ ఫిదా అయిపోతున్నారు. గతంలో నాని-శివ నిర్వాణ కాంబినేషన్ 'నిన్నుకోరి' సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా.. థమన్ బాణీలు కట్టారు. ఈ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చిందని, ఏకంగా 45 కోట్లు చెల్లించి ఈ మూవీ హక్కులు తీసుకుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gFivYH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...