Friday, 27 August 2021

‘చేతికి బేడీలు.. మొత్తం విధ్వంసమే..’.. యువ హీరో కోసం విజయ్ సేతుపతి..

తొలి సినిమా నుంచే తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మది దోచుకుంటూ వస్తున్నాడు నటుడు . సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా.. హిట్ అవుతున్నాయా.. అనే విషయాన్ని పట్టించుకోకుండా.. తాను.. తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా విలక్షణమైన కథలు తీసుకొని సినిమాలు చేయడంలో సందీప్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ మధ్యకాలంలోనే ‘హాకీ’ క్రీడా ఆధారంగా రూపొందిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అనే సినిమాతో అతను ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం అతను ‘గల్లీ రౌడీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు.. తన కెరీర్‌లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అది దక్షిణాదిన ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న నటుడు విజయ్ సేతుపతితో ఈ టైటిల్‌ని విడుదల చేయించారు. ‘నా ఫేవరేట్ డైరక్టర్ సినిమాలో ఓ భాగంగా ఉండటం నాకు సంతోషంగా ఉంది’ అంటూ విజయ్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకు ‘’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ లుక్‌లో సంకెళ్లతో బంధించిన చేతులు.. రక్తమోడుతూ కనిపించడం మనం గమనించవచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇతర తారాగణం.. తదితర వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక తన సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసినందుకు విజయ్‌కి సందీప్ ధన్యవాదాలు తెలిపారు. విజయ్ సేతుపతితో కలిసి పని చేయడం ఎంతో గర్వంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38kjFnP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...