Sunday, 8 August 2021

Singer Sunitha : సునీత అవకాశాల కోసం వెళ్లలేదా అంటూ ప్రశ్న.. ఏ ఒక్క మగాడు వచ్చి పోషించలేదన్న సింగర్!

సింగర్ ఎప్పుడూ మీడియా, ప్రచారాలకు దూరంగా ఉంటారు. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సునీత యాక్టివ్‌గా ఉంటారు. కానీ రెండో పెళ్లి తరువాత సునీత సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వెరైటీ వస్త్రాధారణతోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు అందరినీ షాక్ చేస్తున్నారు. ఆమె భర్త రామ్ వీరపనేనితో ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో తెలిపేలా కొన్ని ఫోటోలను షేర్ చేస్తుంటారు. పెళ్లి తరువాత తన జీవితం ఎంత ఆనందంగా ఉందో చూపించేందుకు ఇంకొన్ని ఫోటోలు షేర్ చేస్తుంటారు. అలా ఇప్పుడు సునీత సోషల్ మీడియాను బాగానే వాడుకుంటున్నారు. అయితే ఆమె రెండో పెళ్లి మీద ఆ మధ్య జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. సునీత రెండో పెళ్లిని వ్యతిరేకించినా వారు ఎంత మంది ఉన్నా కూడా.. అత్యధిక శాతం మంది మాత్రం ఆమె వైపు మద్దతుగా నిలిచారు. రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పేం ఉందని ట్రోలర్స్‌కు నెటిజన్లే వార్నింగ్ ఇచ్చారు. అలా ఆమె రెండో పెళ్లి నెట్టింట్లో ఎంతగా చర్చకు దారి తీసింది. ఇక తమ జోడి మీద, తన భర్త మీద నెగెటివ్ కామెంట్లు చేసిన వారిని సైతం సునీత చాలా సున్నితంగానే మందలించారు. అలా ఇప్పుడు సునీత ట్రోలింగ్‌పై కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా ఓ మీడియా చానెల్‌కు సునీత ఇంటర్వ్యూను ఇచ్చారు. ఇందులో అనేక కాంట్రవర్సీ ప్రశ్నలను సంధించినట్టు కనిపిస్తోంది. అవకాశాల కోసం మీరు వెళ్లలేదా? అని సునీతను నేరుగా అడిగేశారు. ఏ ఒక్క మగాడు వచ్చి పోషించలేదు అని సునీత ఘాటుగా స్పందించారు. అయితే ఈ ప్రశ్నలు, ఆమె చెప్పిన సమాధానం వెనుకున్న కథ ఏంటో తెలియాల్సి ఉంది. ఇక తాను లేకపోతే చనిపోతాను అని చెప్పిన వారిని చూశానని, రామ్‌ను చూస్తున్నాని తమ దాంపత్య జీవితం గురించి సునీత చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fLcOYL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...