Sunday, 8 August 2021

పూర్తి స్టైలిష్ లుక్‌లో హీరో నాగార్జున్ రీసెంట్ పిక్.. ఇది ఆ సినిమా కోసమేనట..

కింగ్ నాగార్జునకు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ వేరు. ఇతర హీరోలతో పోలిస్తే ఆయన ఫ్యాన్ బేస్ కాస్త విభిన్నంగా ఉంటుంది. ఇతర హీరోల అభిమానులు.. తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే.. నానా అల్లరి చేస్తుంటారు. కానీ, నాగార్జున ఫ్యాన్స్ మాత్రం సైలెంట్‌గా ఉంటూ తమ అభిమాన హీరోకి మద్దతు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రధానంగా తన సూపర్‌హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘బంగార్రాజు’ సినిమా. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీంతో పాటు.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’లో కూడా నాగార్జున నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, మౌనీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు నాగార్జున జాతీయ అవార్డు గ్రహిత దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమా నుంచి నాగార్జున స్టిల్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో నాగార్జున ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. నాగార్జున, కాజల్ కలిసి నటించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. కాజల్ కూడ తన కెరీర్‌లో ఈ పాత్ర ఎంతో ప్రత్యేకమైనది అని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jQsQSD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...