Wednesday, 25 August 2021

Sarkaru Vaari Paata : గోవాకు గుడ్ బై.. హైద్రాబాద్ బయల్దేరిన మహేష్

సూపర్ స్టార్ హైద్రాబాద్ తిరుగు పయనమయ్యారు. రెండు వారాల క్రితం షూటింగ్ కోసం గోవాకువెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తన ఫ్యామిలీని తీసుకుని ఆగస్ట్ 12న గోవాకు చెక్కేశారు. ఆయనతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ కూడా గోవాకు వెళ్లింది. ఓ వైపు మహేష్ బాబు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే గోవాలో షూటింగ్ కూడా కానిచ్చేశారు. అయితే ఈ రెండు వారాల షూటింగ్‌ను మహేష్ బాబు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసేశారు. కాసేపటి క్రితమే గోవా నుంచి హైద్రాబాద్‌కు వచ్చే ఫ్లైట్ ఎక్కేశారు. ఈ మేరకు నమత్ర ఓ పోస్ట్ చేసింది. ఈ స్పెషల్ ఫ్లైట్‌లో వంశీ పైడిపల్లి, మహేష్ బాబు ఫ్యామిలీలు కలిసి వస్తున్నట్టున్నాయి. ఇక వెనకాల పిల్లలందరూ కూర్చుని ముచ్చట్లాడుతున్నట్టున్నారు. ముందు మహేష్ బాబు, మంజుల ఘట్టమనేని, నమత్ర, వంశీ పైడిపల్లి, ఆయన సతీమణి ఉన్నారు. మొత్తానికి గోవా షెడ్యూల్ అయితే సక్సెస్ ఫుల్‌గానే కంప్లీట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. గోవా టు హైద్రాబాద్.. అక్కడున్న ప్రతీక్షణం ఎంజాయ్ చేశాను.. మళ్లీ కలిసే వరకు బై అంటూ నమత్ర అసలు విషయాన్ని చెప్పేశారు. గోవాలో రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు కంపోజ్ చేశారట. అవి సినిమాకు హైలెట్ అవుతాయని టాక్. ఇక ఇప్పటికే వదిలిన సర్కారు వారి పాట బ్లాస్టర్స్ ట్విట్టర్, యూట్యూబ్ ఇలా అన్నింట్లో రికార్డుల మోత మోగించేస్తోంది. కీర్తి సురేష్, మహేష్ బాబు కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తమన్ సంగీతంతో అదరగొట్టేసేలా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gxAZub
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...