Wednesday, 25 August 2021

సినీ జీవితంపై సమంత షాకింగ్ డిసీజన్.. అక్కినేని కోడలి నిర్ణయం వెనుక రీజన్ అదేనా? ఇష్యూ హాట్ టాపిక్

'ఏ మాయ చేశావే' అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత.. తన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యను పెళ్లాడి అక్కినేని కోడలిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తోంది. పెళ్లి తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి తీసుకున్న ఓ నిర్ణయం జనాల్లో చర్చనీయాంశం అయింది. దాదాపు పదేళ్లుగా తెలుగు తెరపై తనకంటూ స్పెషల్ పాపులారిటీ తెచ్చుకున్న సమంత.. అటు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ కూడా చేసిన సామ్.. ఇప్పుడు మాత్రం కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటానని చెబుతోంది. తొలిసారి కెరీర్‌లో చారిత్రాత్మ‌క మూవీ '' మూవీ చేస్తున్న సమంత, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది. అలాగే నయనతారతో కలిసి 'కాత్తు వాక్కుల రెండు కాదల్' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఫినిష్ చేసి మరే సినిమాకు కమిట్ కాకుండా కొద్దిరోజులు కుటుంబంతో హాయిగా గడపాలని డిసైడ్ అయిందట సమంత. ప్రస్తుతం తాను కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని, తాను కొన్ని సినిమాల్లో చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపింది. దీంతో సమంత ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆమె తల్లి కాబోతోందా? అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సామ్ తీసుకున్న డిసీజన్‌తో ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆమె ఇష్యూనే హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ziQ5ex
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...