Thursday, 12 August 2021

Pooja Hegde : సమంత, పూజా హెగ్డేలు కూడా దిగదుడుపే.. దక్షిణాదిన రష్మిక హవా!

రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఈ కన్నడ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నేషనల్ క్రష్‌గా రష్మిక క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క బాలీవుడ్ చిత్రంలోనూ నటించకపోయినా జాతీయ స్థాయిలో ఇంతటి ఫాలోయింగ్‌ను సంపాదించడం అంత ఈజీ కాదు. డబ్బింగ్ చిత్రాలతో హిందీ ప్రేక్షకులను రష్మిక పలకరించారు. ఇక సౌత్‌లో అయితే రష్మిక క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతూ వచ్చింది. శాండల్ వుడ్ ద్వారా సినీ ఎంట్రీ జరిగినా కూడా టాలీవుడ్ స్టార్ స్టేటస్‌ను తెచ్చి పెట్టింది. వచ్చిన కొన్ని రోజులకే ఇక్కడి టాప్ స్టార్‌ల దృష్టిలో పడింది. ఆ వెంటనే అమ్మడు కోలీవుడ్ మీద కన్నేశారు. అలా కార్తీ సినిమాలో చాన్స్ కొట్టేశారు. సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టేశారు. ఇలా జూనియర్ అయిన రష్మిక తన కంటే ముందుగా వచ్చి, స్టార్డం తెచ్చుకున్న హీరోయిన్ల కంటే ఎంతో ముందున్నారు. ఇన్ స్టాగ్రాంలో రష్మిక దూకుడు మామూలుగా ఉండటం లేదు. అతి తక్కువ కాలంలోనే 20 మిలియన్ల మార్క్ అందుకుంది. ఇప్పటి వరకు దక్షిణాదిన ఆ ఫీట్ అందుకున్న హీరోయిన్ మరొక్కరు లేరు. (18), రకుల్ ప్రీత్ (17.3), (14.8), కాజల్(19.3), శ్రుతీ హాసన్ (17.2), తమన్నా (14) వంటి వారు సైతం రష్మిక ముందు గులాం అనాల్సిందే. ఈ లెక్కలే చెబుతున్నాయి రష్మిక రేంజ్ ఏంటో. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు, టాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fZpPya
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...