Friday, 13 August 2021

NTR 30: అనిరుధ్ మ్యూజికల్ ట్రీట్.. కొరటాల ఫిక్స్.. బిగ్ డీల్ ఓకే చేసిన టీమ్!

టాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్ టైగర్ వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. వరుసపెట్టి బిగ్గెస్ట్ సినిమాల్లో భాగమవుతున్న ఆయన, RRR తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను లైన్‌లో పెట్టేశారు. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జనతా గ్యారేజ్‌’ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాల- ఎన్టీఆర్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఓ వైపు చిరంజీవితో చేస్తున్న 'ఆచార్య' మూవీ షూటింగ్ పనులు చూసుకుంటూనే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు కొరటాల. తారక్‌ పుట్టినరోజు కానుకగా NTR30 నుంచి సరికొత్త ఫొటోని షేర్‌ చేయడంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌గా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ని ఫైనల్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ అతడితో సంప్రదింపులు జరపగా.. దీనికి ఓకే చెప్పేశాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏకంగా రూ. 4.50 కోట్లు డిమాండ్ చేశాడట. అతడికి ఉన్న టాలెంట్, డిమాండ్ ఇలా అన్నింటినీ పరిశీలన లోకి తీసుకున్న చిత్ర యూనిట్.. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయం చిత్ర వర్గాల నుంచి బయటకు రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కళ్యాణ్ రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా వచ్చే సంవత్సరం (2022) ఏప్రిల్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటన ఇచ్చేశారు కొరటాల శివ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fV2OfJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...