Wednesday, 11 August 2021

Nagababu: తరాలు మారినా నీ స్థానం అదే.. చిరంజీవిపై నాగబాబు కామెంట్స్! రంగంలోకి పవన్ ఫ్యాన్స్..

టాలీవుడ్ రారాజు.. ఆయన డైలాగ్ చెప్పారంటే శత్రుమూకల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. ఆయన స్టెప్పేస్తే ఈలల సౌండ్ మోగిపోవాల్సిందే.. ఇలా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వెండితెరపై మెగాస్టార్‌గా దశాబ్దాల కాలంగా అలరిస్తూ నేటికీ అదే గ్రేస్ కంటిన్యూ చేస్తున్నారు చిరంజీవి. ఆ ఎనర్జీ ఆయనొక్కడికే సొంతం కావచ్చు అన్నట్లుగా ఉంది బాస్ దూకుడు. ఇదే విషయాన్ని ఒక్క మాటలో చెప్పే ప్రయత్నం చేశారు మెగా బ్రదర్ . ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులోకి ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చి చేస్తున్న కామెంట్స్ చర్చల్లో నిలుస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన చిరంజీవి లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన యంగ్ హీరోలను మించి అట్రాక్ట్ చేసే లుక్‌లో కనిపిస్తుండటంతో మెగా అభిమానలోకం ఈ ఫొటోలను తెగ షేర్ చేసుకుంటోంది. అయితే ఇదే చిరంజీవి ఫొటోను మధ్యలో ఉంచి రెండు వైపులా మిగితా మెగా హీరోల ఫొటోలు పెట్టిన ఓ ఫ్రేమ్ తన ఇన్స్‌స్టా ఖాతాలో షేర్ చేశారు నాగబాబు. ''ఈ పిక్‌లోని మెగా హీరోలందరిలో మీరే యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్‌లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్య'' అని దీనిపై కామెంట్ చేశారు. అయితే నాగబాబు షేర్ చేసిన ఈ ఫ్రేమ్‌లో మెగా కాంపౌండ్ హీరోలందరూ కనిపించారు కానీ పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు. దీంతో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి మా హీరో ఎక్కడ, పవర్ స్టార్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ''తమ తరం తర్వాత వచ్చిన మెగా హీరోలు కానీ, రాబోయే మెగా హీరోలు కానీ'' అనేది నాగబాబు చేసిన కామెంట్ ఉద్దేశ్యం కావచ్చు. కానీ ఆ ఫ్రేమ్‌లో లేకపోవడం పవన్ అభిమానులకు కాస్త వెలితిగా అనిపించిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో 'ఆచార్య'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చిరంజీవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3s88B6m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...