Wednesday, 11 August 2021

బుల్లితెరపై అల్లు వారబ్బాయి..! తమన్నాతో కలిసి సందడి.. యంగ్ హీరో క్రేజీ ఫీలింగ్స్

ప్రస్తుతం వెండితెరతో సరిసమానంగా బుల్లితెర హంగామా నడుస్తోంది. వెండితెరపై మెరుపులు మెరిపించిన ఎంతోమంది తారలు బుల్లితెరపై హంగామా చేసేందుకు రెడీ అవుతుండటం చూస్తున్నాం. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, నాని లాంటి తెలుగు హీరోలు బుల్లితెరపై ప్రోగ్రామ్స్ హోస్ట్ చేయగా ఇప్పుడు మిల్కీ బ్యూటీ కూడా అదే దారిలో వెళుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఓ బుల్లితెర కార్యక్రమం హోస్ట్ చేసేందుకు తమన్నా ముందుకొచ్చింది. అదే . ఈ ప్రోగ్రాం ద్వారా వంటల ముచ్చట్లతో ఫిదా చేయనుంది తమ్మూ. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాంను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కోసం తమన్నా హోస్టింగ్ బాధ్యతలు తీసుకుంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుండగా.. రీసెంట్‌గా ప్రోమో రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరనే దానిపై ఊహాగానాలు మొదలు కాగా, అల్లు వారబ్బాయి తానే ఫస్ట్ గెస్ట్ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. అల్లు శిరీష్ ఈ విషయాన్ని తన ఇన్‏స్టా స్టోరీ ద్వారా ప్రకటిస్తూ తమన్నాతో కలిసి మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఫస్ట్ సెలబ్రెటీ గెస్ట్ అయినందకు ఎగ్జైటింగ్‏గా ఉంది. షూటింగ్ కూడా పూర్తి చేసామంటూ శిరీష్ తెలిపారు. అతి త్వరలో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. వెండితెరపై సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ బుల్లితెరపై ఏ మేర సందడి చేశారో చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XbvHxy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...