Saturday, 14 August 2021

Mahesh Babu ఫ్యాన్స్ దెబ్బకు బండ్ల గణేష్ వెనుకడుగు.. అందుకే ట్విట్టర్‌కు దూరం!!

ట్విట్టర్‌లో ఎంతటి దూకుడును ప్రదర్శిస్తారో అందరికీ తెలిసిందే. తన దేవుడు పవన్ కళ్యాణ్‌ను దేవర అంటూ ఎలా పూజిస్తాడో.. కొలుస్తాడో అందరికీ తెలిసిందే. అయితే కొన్ని సార్లు ఆ భక్తి మిగతా వాళ్లకి విరక్తిని కలిగించేట్టు ఉంటుంది. మిగతా హీరోల అభిమానులను కాస్త తక్కువ చేసినట్టు అనిపిస్తుంది. తాజాగా బండ్ల గణేష్ వేసిన ఓ ట్వీట్ కాంట్రవర్సీకి దారి తీసింది. అది కాస్తా అభిమానులు ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. అసలు జరిగిన మ్యాటర్ ఏంటో ఓ సారి చూద్దాం. రానా మూవీకి సంబంధించిన అప్డేట్ చెబుతూ నిన్న ఒక పోస్టర్‌ను చిత్రయూనిట్ వదిలింది. ఆగస్ట్ 15న మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ వదలబోతోన్నామంటూ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ స్టిల్‌ను షేర్ చేశారు. ఇక పవన్ లుంగీ ఎత్తి అలా నడుస్తున్న స్టిల్‌పై బండ్ల గణేష్ తన ప్రేమ, అభిమానాన్ని, భక్తిని చాటుకున్నారు. దేవర దెబ్బ బాబుల్ గాడి అబ్బా అని ట్వీట్ వేశారు. ఇందులో కొందరు పవన్ కళ్యాణ్ మీదున్న ప్రేమను చూస్తే.. ఇంకొందరు మహేష్ బాబు మీదే సెటైర్ వేశారని అనుకుంటున్నారు. అలా మహేష్ బాబు ఫ్యాన్స్ బండ్ల గణేష్‌ను ట్రోల్ చేస్తున్నారు. అసలే కాంట్రవర్సీలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న బండ్లన్నకు ఇలా మహేష్ బాబు అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదురుకావడంతో మొత్తంగా సోషల్ మీడియాకే దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఇలా ట్విట్టర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.. నా జీవితంలో కాంట్రవర్సీలు వద్దు అని బండ్లన్న చెప్పుకొచ్చారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jWppcS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...