మెగాస్టార్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆచార్య తరువాత చిరు లూసిఫర్ రీమేక్ అయిన చిత్రాన్ని ప్రారంభించేశారు. చిరు బర్త్ డే రోజును ఈ రీమేక్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అంటూ వెరైటీగా డిజైన్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. గాడ్ ఫాదర్ అనే ఈ టైటిల్ చిరుకు కరెక్ట్‌గా సరిపోయిందని అందరూ కామెంట్లు చేయసాగారు. అయితే ఎంతో ఘనంగా షూటింగ్‌ను మొదలుపెట్టిన ఈ మూవీ యూనిట్‌కు గట్టి దెబ్బ తగిలినట్టు అయింది. షూటింగ్ మొదలుపెట్టి ఫుల్ జోష్‌లో దూసుకుపోతోన్న యూనిట్ స్పీడ్‌కు బ్రేకులు పడ్డట్టు అయింది. కెమెరా మెన్ రూపంలో గాడ్ ఫాదర్ యూనిట్‌కు షాక్ తగిలింది. ఆయన ఓ వారం రోజుల పాటు విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందట. దీంతో షూటింగ్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. నీరవ్ షాకు ఇంతకు ముందున్న కమిట్మెంట్ ప్రకారం రష్యాకు వెళ్లాల్సి వచ్చిందట. అజిత్ వలిమై సినిమా చివరి షెడ్యూల్ కోసం నీరవ్ షా.. రష్యాకు వెళ్లారట. దీంతో గాడ్ ఫాదర్ సినిమా యూనిట్ వారం రోజుల పాటు షూటింగ్‌ను వాయిదా వేసినట్టు సమాచారం. మొత్తానికి గాడ్ ఫాదర్ టీంకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఇక మరి ఈ గ్యాప్‌లో చిత్ర యూనిట్ ఎలాంటి ప్లాన్లు వేస్తుందో చూడాలి. ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38cdNNx
v
No comments:
Post a Comment