Sunday, 15 August 2021

COVID Response Fund : భాగస్వామ్యులవ్వండి.. చిరు వీడియో

కరోనాతో దేశం అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఎంతో మంది మరణించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలోని దాదాపు అన్ని రంగాలు వెనకబడ్డాయి. ఎంతో మంది ఆకలితో అలమటించారు.సరైన వైద్యం అందక ఎంతో మంది కరోనాతో కన్ను మూశారు. అయితే ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. సెలెబ్రిటీలు సైతం తమ వంతుగా సాయం చేశారు. కరోనా చారిటబుల్ ట్రస్ట్ సీసీసీ అంటూ గత ఏడాది సినిమా కార్మికులను ఆదుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి ఓ వీడియోను వదిలారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వేసిన ట్వీట్ మీద చిరు కూడా స్పందించారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడుదాం. త్వరలోనే మీ ముందుకు వస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. రిలీఫ్‌లో పాలు పంచుకోండి.. ఈ మంచి పనిలో మీరూ కొంత సాయం చేయండి.. ఇండియా కోవిడ్ రెస్పాండ్ద ఫండ్‌కు మద్దతు ఇవ్వండని చిరు కోరారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ పూర్తి చేసేశారు. ఈ మధ్యే లూసిఫర్ రీమేక్ షూటింగ్‌ను ప్రారంభించారు. దీనికి అదిరిపోయే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తమన్ హింట్ ఇచ్చేశాడు. అంతే కాకుండా ఫస్ట్ సాంగ్ కూడా పూర్తయిందని తమన్ పేర్కొన్నారు. మొదటి రోజే చిరంజీవి యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AKBF77
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...