Sunday, 8 August 2021

‘అఖండ’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన సర్‌ప్రైజ్

బాలకృష్ణ.. కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘’. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ.. ఓ టీజర్‌ని వదిలారు. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కోస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ చెప్పిన ఒకేఒక్క డైలాగ్ ఇప్పుడు ఎక్కడ చూసిన ట్రెండింగ్ అవుతోంది. కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు.. ఆఘోరీ రూపంలో బాలకృష్ణ లుక్స్‌తో సోషల్‌మీడియా మొత్తం దద్దరిల్లిపోతుంది. టీజర్ వచ్చి చాలాకాలమే అయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ రెడీ అవుతోంది. ఈ ఆగస్టు 15వ తేదీన సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇవ్వనున్నారట. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం భారతీయులకు ఎంతో ప్రత్యేకమై రోజు.. కాబట్టి అదే రేంజ్‌లో ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌ని చిత్ర యూని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అది సినిమా నుంచి మరో టీజరా.. లేక తొలి పాటనా అనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి ఫ్యాన్స్‌కి మరోసారి ఫీస్ట్ ఇచ్చేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది. ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ పూర్ణ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ, శ్రీకాంత్ మధ్య ఉండే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని టాక్. మరి ఈ సినిమా అప్‌డేట్ గురించి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VzuwaQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...