Sunday, 8 August 2021

స్టేజ్ మీద అలా.. విజయేంద్ర ప్రసాద్‌ను ఆడుకున్న ఆర్జీవీ..దండం పెట్టేసిన స్టార్ రైటర్

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తారో తెలియదు. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారా? అని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వర్మ స్టేజ్ ఎక్కితే, మైకు చేతిలో ఉంటే ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. తాజాగా వర్మ ఓ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సునీల్ కనబడుట లేదు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో , ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ ఈవెంట్‌లో వర్మ స్పీచ్ అందరికంటే హైలెట్ అయింది. హీరోయిన్ గురించి మాట్లాడిన మాటలు, సినిమాల్లో తాను హీరోయిన్‌ను మాత్రమే చూస్తానని, తనకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అని వర్మ అందరి ముందే చెప్పి నవ్వించేశారు. అయితే ఆ మాటల కంటే ముందుగా విజయేంద్ర ప్రసాద్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు వర్మ. ఏదో సీరియస్ విషయం గురించి అడుగుతారని అ అంతా ఎదురుచూస్తే.. ఆయన గడ్డం గురించి వర్మ అడిగి నవ్వులు పూయించారు. మీరు ఆ గడ్డాన్ని ఎందుకు అంతగా పెంచుతున్నారు?.. దానికి నరేంద్ర మోడీ స్పూర్తినా? రామాయణం కంటే గొప్పదైన బాహుబలిని తీశారు అని.. వాల్మీకి కంటే ఎక్కువగా ఉండాలని పెంచుకుంటున్నారా?.. లేదా నా బోడి కొడుక్కే అంత ఉంటే.. నాకు ఎంత ఉండాలని రాజమౌళిని కంటే ఎక్కువగా ఉండాలని పెంచుతున్నారా? అని విజయేంద్ర ప్రసాద్‌ను ఆట పట్టించారు వర్మ. ఇక ఆర్జీవీ దెబ్బకు విజయేంద్ర ప్రసాద్ దండం పెట్టేశారు. మొత్తానికి వర్మ మాత్రం తన అనుమానాన్ని అందరి ముందే అడిగి తన బరువును దించుకున్నట్టైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AjKTqP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...