Friday, 6 August 2021

వాటిని చూసి ఫీల్ అవుతాడు.. తరుణ్ భాస్కర్‌పై మంచు లక్ష్మీ కామెంట్స్

ప్రస్తుతం ఆహా కోసం ఓ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. వంటల ప్రోగ్రాంతో ప్రేక్షకులను మెప్పించేందుకు మంచు లక్ష్మీ ప్రయత్నం చేస్తున్నారు. అనే ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మీ తన స్టైల్లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. ఇందులో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్‌లు గెస్టులుగా వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్ చేసిన వింత వంటకాలు, రకుల్ రెండో ఎపిసోడ్‌లో అల్లరి చేసిన విధానం అన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో ఎపిసోడ్ వచ్చేసింది. ఈ మూడో ఎపిసోడ్ కోసం ఆహా టీం తరుణ్ భాస్కర్‌ను తీసుకొచ్చింది. భోజన ప్రియుడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అందుకే పెళ్లి చూపులు అంటూ తన మొదటి సినిమాను ఫుడ్ మీదే తీసేశారు. ఈ సినిమా కోసం ముందుగా మంచు లక్ష్మీనే కలిశాడట. కలిసి తీద్దామని అనుకున్నారట కానీ ఆ తరువాత కొన్ని పరిస్థితుల వల్ల మిస్ అయిందని చెప్పుకొచ్చారు. ఫుడ్ వల్లే మంచు లక్ష్మీతో క్లోజ్ అయ్యానని తరుణ్ భాస్కర్ అన్నారు. అయితే తరుణ్ భాస్కర్ గురించి మంచు లక్ష్మీ కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. తరుణ్ ఎంతో సున్నితమైన స్వభావం కలవాడు అని అన్నారు. ఇన్ స్టాగ్రాంలో కామెంట్లు చూసి కూడా ఫీల్ అవుతాడు.. అని పేర్కొన్నారు. ఇప్పుడు మారిపోయావా? అని అడిగితే.. తరుణ్ వింత సమాధానం ఇచ్చారు. అందరినీ బ్లాక్ చేసేస్తున్నాను అని తరుణ్ భాస్కర్ చెప్పగా.. తాను కూడా అంతేనని మంచు లక్ష్మీ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xwu3TA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...