సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ నుంచి అనే కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. శివ కేశన కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాతో ఆయన ల్యాండ్ అవుతున్నాడు. అయితే ఆదిలోనే ఆ హీరోకు సపోర్ట్ లభించింది. ఈ సినిమాలో హీరో లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు. మహేష్ బాబు పుట్టిన రోజున ఈ లుక్ వదిలి సూపర్ స్టార్ అభిమానుల ఆదరణ చూరగొన్నారు. ఈ పోస్టర్‌లో హీరో తలకి చిన్నగాయమైనట్లు బ్యాండేజ్ వేసుకుని నిలబడి ఉన్నాడు హీరో శరణ్ కుమార్. ఆయన వెనుక జనాలు, రోడ్డుపై రెండు వాహనాలు వెళ్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేసి సినిమా కథ పట్ల క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే క్రైం థ్రిల్లింగ్ నేపథ్యంలో డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ పోస్టర్ లాంచ్ చేసిన ఈ మూవీ ఆయనకు పర్‌ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుందని అన్నారు. శరణ్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాలో హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పారు. శరణ్ యాక్టర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. మహేష్ బాబు పుట్టినరోజున తమ సినిమాలోని హీరో లుక్‌ని కృష్ణ గారు విడుదల చేయడం ఆనందంగా ఉందని నిర్మాత ఎం.సుధాకర్ రెడ్డి అన్నారు. అతిత్వరలో ఈ సినిమా టైటిల్, ఇతర వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ivK08h
v
No comments:
Post a Comment