Monday, 9 August 2021

ఓవైపు డ్రింక్‌ మరోవైపు స్విమ్మింగ్ పూల్‌.. పార్టీలో ఫుల్లుగా చిల్.. కూతురితో సురేఖా వాణి హల్చల్

కూతురు బర్త్ డే పార్టీకి సంబంధించిన రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నిన్న (ఆగస్ట్ 8) సుప్రిత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, సురేఖా వాణి డ్యాన్స్ వేసిన వీడియోలు తెగ హల్చల్ చేశాయి. తల్లీకూతుళ్లు మీద లెక్కలేనన్నీ మీమ్స్ వచ్చాయి. తల్లికూతుళ్లు కాదు.. అక్కాచెల్లెళ్లలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం నిన్న ఫుల్లుగా చిల్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె ఇన్ స్టా స్టోరీని గమనిస్తే వారు ఏ రేంజ్‌లో సందడి చేశారో తెలుస్తుంది. సుప్రితకు అసలే గోవా అంటే మహా ప్రాణం. ఎప్పుడెప్పుడు గోవాకు వెళ్తానా? అని ఎదురుచూస్తూ వచ్చారు. తీరా ఇలా బర్త్ డే సందర్భంగా గోవాకు టూర్ వేసేశారు. బర్త్ డే పార్టీలో సుప్రిత, సురేఖా వాణి ఇద్దరూ కూడా తెగ రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది. నిన్న అంతా కూడా గోవా వీధుల్లో తెగ చక్కర్లు కొట్టినట్టు కనిపిస్తోంది. అక్కడి పబ్‌లు, బీచ్‌లు తిరుగుతూ తెగ హల్చల్ చేసినట్టున్నారు. ఈ మేరకు ఫేమస్ బీచ్‌లో డ్రింక్ తాగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక పక్కనే ఉన్న బీచ్‌లో బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. పూల్ టైం అంటూ స్విమ్మింగ్ పూల్‌లో తల్లీకూతుళ్లిద్దరూ కాళ్లు పెట్టి జలకాలాడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి సుప్రిత బర్త్ డే మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక వీరిద్దరూ నేడు తిరిగి హైద్రాబాద్ చేరుకోబోతోన్నట్టు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jBllyG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...