Tuesday, 10 August 2021

ఇకపై థియేటర్లో ఐదు షోలు.. ఎగ్జిబిటర్ల వినతిపై మంత్రి తలసాని రియాక్షన్!

ప్రస్తుతం సినిమా థియేటర్ల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల థియేటర్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలినట్టు అయింది. అయితే ఇప్పుడిప్పుడే గాడిన పడేట్టు కనిపిస్తోంది. తెలంగాణలో థియేటర్లో వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఇంకా థియేటర్ల సమస్యలు గాడిన పడలేదు. తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్లందరూ కూడా తెలంగాణ సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు. తాజాగా ఈ భేటీకి సంబంధించిన విషయాలు మంత్రి తలసాని మీడియాతో చెప్పుకొచ్చారు. విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమ‌ని మంత్రి అన్నారు. న‌గ‌రంలోని తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి త‌ల‌సాని అధ్యక్షతన మంగ‌ళ‌వారం స‌మీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌ల కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా నష్టపోయిన సినీ రంగాన్ని ఆదుకునేందుకు 5వ షో ప్రద‌ర్శన‌కు అనుమ‌తివ్వాలని మంత్రిని కోరారు. దీంతో 5వ షోకు అనుమతిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో థియేటర్‌లు మూసివేసి ఉన్న కార‌ణంగా విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు తదితర విజ్ఞప్తుల‌ను ప్రభుత్వానికి అందజేసిన‌ట్లు తెలిపారు. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రమాదం కూడా పొంచి ఉందన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో థియేటర్ల వ్యవస్థ ఎప్పుడు గాడిన పడుతుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3izIx0P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...