Sunday, 15 August 2021

నిలదీస్‌ఫై అంటూ అలీ కౌంటర్.. మీరు మాత్రమే అలా చేస్తారా? అంటూ మంచు లక్ష్మీ ఫైర్!

ప్రస్తుతం ఆహా యాప్ కోసం వంటల ప్రోగ్రాంను చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెలెబ్రిటీలను తీసుకొచ్చి వారికిష్టమైన వంటకాలను వండించేలా చేస్తున్నారు మంచు లక్ష్మీ. ఇప్పటికే విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, తరుణ్ భాస్కర్ వంటి వారు వచ్చారు. రకరకాల వంటలను వండేశారు. వీరంతా కూడా వెజిటేరియన్ వంటకాలను వండేశారు. కానీ అలీ మాత్రం నాన్ వెజ్‌ను వండారు. గోంగూర మటన్ అంటూ అందరినీ నోరూరించేశారు. అయితే ఈ క్రమంలో , మంచు లక్ష్మీ పెట్టిన ముచ్చట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. మధ్యలో మంచు లక్ష్మీ నిలదీస్‌ఫై మ్యాటర్ కూడా వచ్చింది. ఆ పదం మీనింగ్ ఏంటి? అదెక్కడి నుంచి వచ్చింది? అంటూ మంచు లక్ష్మీ పరువుతీశారు ఆలీ. దాన్ని తింగ్లీష్ అంటారు.. తెలుగు ఇంగ్లీష్ కలిపితే వస్తుంది.. అవి ఎక్కడా ఉండవు.. మంచు లక్ష్మీ దగ్గరే ఉంటాయని చెప్పుకొచ్చారు. అయిన మీరు ఒక్కరే కొత్త పదాలను సృష్టిస్తారా? మేం చేయకూడదా అని ఆలీ మీద సెటైర్ వేశారు మంచు లక్ష్మీ. ఎంద చాట, కాట్రవల్లీ అనే పదాలను మీరు కూడా క్రియేట్ చేశారు కదా? అలానే నేను కూడా అని మంచు లక్ష్మీ కౌంటర్ వేశారు. చాట అంటే కేరళలో అన్న అని, కాట్రవర్సీ అంటూ మా ఊరికి దగ్గర్లో ఉండే మరో ఊరు పేరు అని అక్కడి నుంచే అది వచ్చిందని ఆలీ కూడా కవర్ చేసేశారు. మొత్తానికి ఈ వంటల ప్రోగ్రాంలో నిలదీస్ ఫై మ్యాటర్ హైలెట్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VWPujT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...