Sunday, 15 August 2021

ఇంకా కావాలని ఉంది!!.. ఇలియానా హాట్ పోజులు వైరల్

గోవా బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఒక్క హిట్టు సినిమా చేతిలో లేకపోయినా కూడా ఇలియానా మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. అలాంటి ఇలియానా సోషల్ మీడియాలో బికినీ అందాలను ఎరగా వేస్తుంటారు. ఇలియానాకు బీచ్‌లు, వెకేషన్స్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా తాను బీచ్ సౌందర్యాలను ఎంతగా మిస్ అవుతున్నారో చెబుతూ చేసిన పోస్ట్‌లు బాగానే వైరల్ అయ్యాయి. అలా ఇలియానా ఇప్పుడు చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. వీకెండ్ అంటే అందరికీ ఓ చిన్నపాటి బద్దకం అనిపిస్తుంది. వర్క్ చేయడం, వర్కవుట్లు చేయడం అంటే కాసింత కష్టంగానే ఉంటుంది. ఇక వీకెండ్‌లో ఉదయాన్నే లేవడం అంటే కూడా కొందరికీ అయిష్టంగానే ఉంటుంది. అలాంటిది ఇలియానా కూడా ఈ వీకెండ్‌లో కాస్త బద్దకంగానే ఉన్నట్టుంది. ఉదయాన్నే లేవడంపై తాను చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ఇలియానా ఉదయాన్నే నిద్రలేచినట్టుంది. కానీ తనకు ఇంకా పడుకోవాలిన ఉందంటూ బెడ్ మీద నుంచే ఓ పోస్ట్ పెట్టేశారు. అలా నిద్రమత్తులో ఉన్న ఇలియానా ఎంతో క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలీవుడ్‌లో ఇలియానాకు ఇప్పుడు అంతగా అవకాశాలేవీ రావడం లేదు. ఇక టాలీవుడ్‌లో అవకాశాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. చివరగా ఇలియానా బిగ్ బుల్ అనే చిత్రంలో నటించారు. కానీ అది కూడా ఫ్లాప్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sinOBW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...