Sunday, 1 August 2021

మోస్ట్ రొమాంటిక్ కపుల్.. మళ్లీ అంత వరకు బై.. నితిన్‌తో షాలిని రచ్చ

టాలీవుడ్ హీరో ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య షాలినీతో కలిసి మాల్దీవులకు చెక్కేశారు. వారి వివాహాం జరిగి ఏడాది గడిచిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలై 26న ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో మొదటి వివాహా దినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయినట్టుంది. అందుకే సినిమా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చిన నితిన్.. మాల్దీవులకు పయనమయ్యారు. గత ఐదారు రోజుల నుంచి అక్కడే ఉంటున్న నితిన్ మొత్తానికి అక్కడి ప్రాంతానికి గుడ్ బై చెప్పినట్టు కనిపిస్తోంది. పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకుందామని నితిన్ అనుకున్నారు. కరోనా వల్ల ఆ ప్లాన్ మారిపోయింది. ఆ తరువాత హనీమూన్ కోసం కూడా ప్లాన్ వేసినట్టున్నారు. అది కూడా కుదరలేదు. అలా దుబాయ్‌లో తన రంగ్ దే సినిమా షూటింగ్ ఉంటే.. భార్యను కూడా తీసుకెళ్లారు నితిన్. అలా ఓ వైపు షూటింగ్.. మరో వైపు హనీమూన్‌ను ఎంజాయ్ చేసేశారు. అలా ఇప్పుడు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని మాల్దీవుల్లో ఎంజాయ్ చేయాలని నితిన్ అక్కడి వెళ్లిపోయారు. మొత్తానికి నాలుగు రోజుల పాటు మాల్దీవుల్లో ఈ జంట ఎంజాయ్ చేసింది. వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను షాలినీ షేర్ చేస్తుండే వారు. అవి నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాల్దీవులకు గుడ్ బై చెప్పినట్టు.. మళ్లీ వచ్చే ఏడాది కలుస్తామన్నట్టుగా షాలినీ చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్‌ను బట్టి చూస్తే ఈ జంట నేడు హైద్రాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పోస్ట్‌లో నితిన్ షాలిని మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక నితిన్ ఇప్పుడు అంధాదున్ రీమేక్ మ్యాస్ట్రో షూటింగ్‌లో బిజీ కానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jgAtBw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...