కన్నడ సినిమాల్లో నటించాక 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గ్లామర్ బ్యూటీగా పాపులారిటీ కూడగట్టుకుంది . ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ అప్పీయరెన్స్ ఇచ్చి అందరినీ బుట్టలో వేసుకుంది. ఊరమాస్ మాటలతో యువతలో క్రేజ్ సంపాదించింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నభాకు ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ దర్శకనిర్మాతలతో పాటు బాలీవుడ్ మేకర్స్ దృష్టి కూడా నభా నటేష్‌పై పడినట్లు సమాచారం. ఈ మేరకు బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించే అరుదైన అవకాశం ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నభాతో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని, ఆమె డేట్స్ కూడా ఇచ్చేసిందని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన స్పై థ్రిల్లర్ ‘ది నైట్ మేనేజర్’ టీవీ సిరీస్‌ను త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వెబ్‌సిరీస్ రూపంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. ఇందులోనే హృతిక్ రోషన్‌ని మేల్ లీడ్‌గా తీసుకొని ఆయన సరసన నభా నటేష్‌ని సెలక్ట్ చేసినట్లు టాక్. అతి త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందిన ప్రతి అవకాశాన్ని తన కెరీర్‌కి ప్లస్ అయ్యేట్టుగా మలచుకుంటున్న నభా నటేష్ అటు సోషల్ మీడియాలోనూ హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్ సరసన 'మాస్ట్రో' సినిమాలో నటిస్తోంది. సో.. చూడాలి మరి నభాకు బాలీవుడ్ ఛాన్స్ ఏ మేర కలిసొస్తుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zYMzWE
v
No comments:
Post a Comment