Friday, 27 August 2021

ఆంజనేయ మాలతో అంజనీపుత్రుని చెంతకు సైకిల్ యాత్ర.. మెగా అభిమానానికి చలించిన చిరు, పవన్

అభిమానుల ప్రేమే మాకు గొప్ప ఆదరణ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలిపిరి నుంచి సైకిల్ యాత్ర చేపట్టి తనని కలవడం కోసం వచ్చిన తన అభిమానిని కలిసిన అనంతరం భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి. మెగాస్టార్ పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగిన విషయం తెలిసిందే.. ఈ వేడుక‌ల్లో ఆయ‌న‌కు విషెస్ తెలిపేందుకు తిరుప‌తి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేప‌ట్టి 12రోజులు ప్ర‌యాణించి.. మెగాస్టార్ ఇంటికి చేరుకున్నారు. ఈ సాహ‌సం స‌రికాద‌ని వారించిన చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా అభిమాని ఎన్ ఈశ్వ‌ర‌య్య.. బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి (అలిపిరి) నుంచి అత‌డు సైకిల్ పై ప్ర‌యాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌రోజు కోసం అత‌డు సైకిల్ యాత్రను చేప‌ట్టి వ‌చ్చి క‌లిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వ‌చ్చాడు ఈ అభిమాని. చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మ‌న‌సు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించిన‌ట్టే మేం కూడా వారు వారి కుటుంబ స‌భ్యులు బావుండాల‌ని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాను అని అన్నారు. అలాగే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని క‌ల‌వాల‌ని అడిగిన ఆ అభిమానికి క‌లిసేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి. వెంటనే ఆ వీరాభిమాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని కలిశారు. దీంతో తన అభిమాన హీరోలను కలవడంతో జన్మ ధన్యం అయ్యిందని.. పన్నెండు రోజుల సైకిల్ ప్రయాణాన్ని వీరిని కలిసిన ఒకరోజులో మర్చిపోయేలా చేసారు మెగాస్టార్ చిరంజీవిగారు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు అంటున్నాడు ఆ వీరాభిమాని తెగ పొంగిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y3u85p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...