Friday, 13 August 2021

లాక్‌డౌన్ తర్వాత మళ్లీ ప్రారంభమైన స్టార్ హీరో సినిమా.. టీమ్‌తో జత కట్టిన దిశా పటానీ

రెండో దశలో కరోనా ఎవరిపై జాలి చూపించ లేదు. సామాన్యులు సెలబ్రిటీలు అనే బేధం లేకుండా అందరిపై విరుచుకుపడింది. కొద్ది రోజుల క్రితం వరకూ దేశవ్యాప్తంగా దాదాపు నాలుగ లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఏ ఆస్పత్రిలో చూసిన కరోనా వైరస్ కేసులే కనిపించాయి. ఈసారి కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో పడింది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడ్డారు. ఇందులో కొందరు వైరస్ నుంచి కోలుకోగా.. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించింది. అయితే ఈసారి లాక్‌డౌన్ నిబంధనలపై పూర్తి హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడిచిపెట్టింది కేంద్రం. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. కొన్ని వ్యవహారాలకు మాత్రమే ఇందులో మినహాయింపులు కల్పించాయి. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లు, విడుదలలు మరోసారి నిలిచిపోయాయి. స్టార్‌లు మరోసారి తమ ఇళ్లకు పరిమితం అయ్యారు. దీని ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభం అయింది. లక్షల సంఖ్య నుంచి వేల సంఖ్యలోకి రోజువారి కేసులు నమోదు అయ్యే సంఖ్య వచ్చేసింది. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు దశల వారిగా ఎత్తివేసింది.. ఫలితంగా మళ్లీ షూటింగ్‌లు, సినిమాల విడుదలు ప్రారంభం అయ్యాయి. అన్నిటితో పాటు బాలీవుడ్‌ స్టార్ హీరో నటిస్తున్న ‘’ సినిమా షూటింగ్‌ కూడా రీసెంట్‌గా ప్రారంభం అయింది. సూపర్‌హిట్ సినిమా ‘ఏక్‌ విలన్‌’కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మోహిత్‌ సూరి. ఈ సినిమాలో జాన్ అబ్రహం, తారా సుతారియాతో పాటు హాట్ బ్యూటీ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో దిశా రీసెంట్‌గా జాయిన్ అయిందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xNHsqC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...