Monday, 16 August 2021

తమన్నా డేర్ మాములుగా లేదే.. ఏకంగా రామ్ చరణ్‌తో వైరం!! సినీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ ఇష్యూ

సీనియర్ హీరోయిన్‌గా తెలుగు తెరపై వరుస సినిమాలతో అలరిస్తోంది . రెండు తరాల హీరోలతో రొమాన్స్ చేస్తూ ఆల్ ఇన్ వన్ బ్యూటీ అనిపించుకుంటోంది. పైగా ఎలాంటి రోల్ చేసినా, ఐటెం సాంగ్ చేసినా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ చేస్తున్న భారీ సినిమా కోసం డేరింగ్ డిసీజన్ తీసుకుందట తమన్నా. ఇప్పటిదాకా ఎప్పుడూ కనిపించని విధంగా వెండితెరపై తన పవర్ చూపించేందుకు రెడీ అనేసిందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తూనే అటు కొరటాల శివ- చిరంజీవి కాంబోలో రాబోతున్న 'ఆచార్య' షూటింగ్ వర్క్స్ ఫినిష్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చెర్రీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ కంప్లీట్ చేసిన శంకర్.. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లాలని అంతా సిద్ధం చేస్తున్నారట. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఫైనల్ చేశారు. అయితే శంకర్ రాసుకున్న కథ ప్రకారం ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని తెలుస్తోంది. అందులో ఒకరిగా తమన్నాను తీసుకుంటున్నారట. ఇందులో ఆమె క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ అని, విలన్ భార్యగా చిత్రాన్ని మలుపుతిప్పే రోల్ తమన్నా చేయనుందని సమాచారం. విలన్ భార్యగా రామ్ చరణ్‌తో ఆమె పెట్టుకునే వైరం సినిమాలో హైలైట్ కానుందని అంటున్నారు. ఈ క్యారెక్టర్ గురించి శంకర్ చెప్పగానే వెంటనే ఓకే చేసిందట మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ విషయం బయటకు రావడంతో సినీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VVqz07
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...