Wednesday, 4 August 2021

ప్రతీ ఒక్కరికీ హెల్ప్ చేయలేను కానీ.. నిరుద్యోగికి సాయం చేయడంపై నవీన్ పొలిశెట్టి

తెరపై నటించే హీరోలు ఒక్కోసారి రియల్ హీరోలనిపించుకుంటూ ఉంటారు. కష్టాల్లో ఉన్న వారికి సాయపడుతూ.. వారి మంచితనాన్ని చాటుకుంటారు. ఇప్పుడు రియల్ హీరో అంటే అందరికీ సోనూ సూద్ మాత్రమే గుర్తుకు వస్తుంటారు. అలా సోనూ సూద్ చేసే మంచి ఇప్పుడు నలుమూలలా పాకింది. అయితే ఈ తరహాలోనే ఓ నెటిజన్‌కు సాయం చేశాడు. కరోనా కష్టకాలంలో ఉద్యోగం కోల్పోయి కష్టాలు పడుతున్న నిరుద్యోగికి అండగా నిలిచాడు. అతడి గురించి చెబుతూ.. ఎక్కడైనా వెకెన్సీ ఉంటే చెప్పండని ట్వీట్ చేశారు నవీన్. అలా నవీన్ వేసిన ట్వీట్‌కు వెంటనే రియాక్షన్ వచ్చింది. సదరు నెటిజన్‌కు ఉద్యోగం లభించింది. దీంతో సదరు వ్యక్తి మాత్రమే కాకుండా మిగిలిన వారంతా నవీన్ పొలిశెట్టిని కీర్తిస్తున్నారు. ఒక్కరికి సాయం చేసినా చాలంటూ కామెంట్లు పెడుతున్నారు. నవీన్ పొలిశెట్టి నిజమైన జాతిరత్నం అంటూ పొగిడేస్తున్నారు. అయితే తాజాగా నవీన్ పొలిశెట్టి స్పందించారు. మీరు చేసిన దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా మాటలు రావడం లేదు సర్ అంటూ నవీన్ పొలిశెట్టికి ట్వీట్ వేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆ ట్వీట్ మీద నవీన్ స్పందిస్తూ.. జాబ్ వచ్చినందుకు కంగ్రాట్స్.. కష్టపడి పని చేయ్.. ఇలాంటి కష్టకాలంలోనే ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి సాయం చేసుకోవాలి.. నేను అందరికీ సాయం చేయలేనేమో గానీ.. ప్రతీ ఒక్కరూ ఎవరో ఒక్కరికైనా సాయం చేయగలరు.. అందరూ వీలైన సాయం చేస్తూ ఉండండి అని కోరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rQquqe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...