Wednesday, 4 August 2021

‘ఒరేయ్ బామ్మర్ది’ ట్రైలర్.. అదరగొట్టేసిన సిద్దార్థ్

సిద్ధార్థ్, జీవీ ప్ర‌కాశ్ కుమార్‌లకు తమిళంలో మంచి డిమాండ్ ఉంది. మంచి కథలను ఎంచుకుంటున్న హీరో .. సంగీత దర్శకుడిగా, నటుడిగానూ మెప్పిస్తున్న జీవీ ప్రకాశ్ కలిసి నటించిన చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించగా.. ‘బిచ్చ‌గాడు’ ఫేమ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో ‘శివ‌ప్పు మంజ‌ల్ ప‌చ్చై’ వచ్చింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ‘’గా ఆగ‌స్ట్ 13న‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం(ఆగ‌స్ట్ 4న) రోజున విడుద‌ల చేశారు. ఇక ఇందులో చేజింగ్ సీన్లు, క్రైమ్ సీన్లు బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. సిద్దార్థ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేసినట్టు కనిపిస్తోంది. పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ.. వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బ‌త‌కాల్సి వ‌స్తుంది. డిపార్ట్‌మెంట్ లోప‌లైనా, బ‌య‌టైనా ఎవ‌రితోనూ నిజాయ‌తీగా ఉండలేక‌పోతున్నాను అంటూ సిద్దార్థ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ బాగానే ఉంది. బైక్ రేసులంటూ తిరగడం, అందులో అక్రమ రవాణా చేయడం వంటి కాన్సెప్ట్‌తో మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీ ‘ఒరేయ్ బామ్మర్ది’ని చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తుండటం హ్యాపీగా ఉంది. సిద్దార్థ్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, నటుడు కూడా తెలుగువారికి సుపరిచితుడే. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశాం. ఇందులో సిద్ధార్థ్, జీవి ప్రకాష్ కుమార్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. ఓ మంచి సినిమాను థియేటర్‌లో చూడాలనుకునే ప్రేక్షకులకు మా ‘ఒరేయ్ బామ్మర్ది’ మంచి ఆప్షన్ అవుతుంది అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fwZqaK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...