Tuesday, 3 August 2021

నాకు కానీ పెళ్లి జరిగితే అక్కడే.. అతనికి అవి ఉంటే చాలు.. తేల్చి చెప్పేసిన జాన్వీ కపూర్

శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన , అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోదు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాలని ఈ భామ భావించింది. అయితే ఆమె అనుకున్న విషయాలు బెడిసికొట్టడంతో ఆ పనికి కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఏ సినిమా దొరికిన చాలు దానితో వెలుగులోకి రావాలి అని భావిస్తోంది జాన్వీ, అయితే శ్రీదేవి తనయ కవడంతో ఆమె కూడా తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్య్వూలో మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుతూ.. తన కుమారుడు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాను రీమేక్ చేయాలని అందులో రామచరణ్ హీరోగా నటించాటని.. హీరోయిన్ శ్రీదేవి కూతురు ఉండాలి అని కోరుకున్నారు. తాజాగా తెలుగు భక్తులకు ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన.. తిరుమలను జాన్వీ కపూర్ సందర్శించుకున్నారు. ఈ సందర్భాంగా ఆమె మాట్లాడుతూ.. తనకు పెళ్లి జరిగితే తిరుమలలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓ ప్రైవేటు బోటులో బ్యాచిలర్ పార్టీ చేసుకొని.. ఆ తర్వాత తిరుమలలోనే పెళ్లి చేసుకుంటాను అని ఆమె స్పష్టం చేశారు. తన తల్లి చెన్నైలో నివసించిన ఇంట్లో ఇంట్లో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు జరగాలని చెప్పింది. పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది తన కోరికని తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37kybeO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...