Tuesday, 3 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: సారా ముక్కుకు గాయం.. హాష్‌తో కలిసి సామ్ ఫన్.. శివకార్తీకేయన్‌కు ప్రమోషన్

అయ్యే ఇలా జరిగిందేటీ.. సారా ముక్కుకు గాయం స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ . సినిమాల ఫలితం ఎలా ఉన్నా అమ్మడు క్రేజ్‌కు మాత్రం ఢోకా లేదు. తాజాగా సారాకు గాయం అయింది. అందుకు సంబంధించి కూడా వినోదభరితంగా వీడియో పోస్ట్ చేసింది. ‘నాక్.. నాక్’ అంటూ తన గాయం గురించి కూడా ఓ ఆసక్తికర వీడియో ద్వారా సందేశం ఇచ్చింది. ‘ప్రేమమ్’ జ్ఞాపకాల్లో అనుపమ హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా దూసుకుపోతుంది. తాజాగా తన మొదటి సినిమా ప్రేమమ్ సినిమాను అనుపమ గుర్తుకు తెచ్చుకుంది. 2014లో తాను ఇలా ఉండేది అంటూ ఆమె కొన్ని పిక్స్‌‌ని షేర్ చేసింది. హాష్ కలిసి.. సమంత ఎంజాయ్.. స్టార్ హీరోయిన్ సమంత సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. నాగచైతన్యతో వివాహం అయిన తర్వాత ఆయనతో పాటు ఆమె పిక్స్ షేర్ చేస్తూ.. చాలా హంగామా చేస్తారు. అంతకంటే ఎక్కువ వాళ్ల పెంపుడు కుక్క ‘హాష్’ కలిసి దిగే ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకుంటారు. తాజాగా హాష్‌తో కలిసి ఆడుకుంటు ఉన్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేశారు సమంత. ‘మీమ్స్ చూస్తే నేను ఇంతే’.. వర్ష నవ్వుల పంట తమిళంలో ‘96’ కానీ, తెలుగులో కానీ ‘జాను’ ఈ రెండు సినిమాల్లో తన ప్రదర్శనతో ప్రేక్షకుల మది దోచుకున్న నటి . ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ అనే సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. అయితే సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వర్ష.. తాజాగా కొన్ని ఆసక్తికర ఫోటోలు షేర్ చేసింది. సోషల్‌మీడియాలో మీమ్స్ చూసినప్పుడు తన రియాక్షన్ ఇదే అంటే నవ్వుల పంట పండిస్తూ.. ఆమె కొన్ని ఫోటోలు అభిమానులతో పంచుకుంది. తండ్రిగా ప్రమోట్ అయిన హీరో .. హీరో శివ కార్తీకేయన్ తాజాగా ప్రమోషన్ పొందారు. ఇంతకాలం హీరోగా, మిమిక్రీ ఆర్టిస్ట్ మనందరిని అలరించిన ఆయన తాజాగా తండ్రిగా మరో మెట్టు ఎక్కారు. తాజాగా శివ కార్తీకేయాన్ సతీమణి పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీని శివ కార్తీకేయన్ ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన కొడుకు గురించి ప్రార్థించిన అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరి ఆశీర్వాదంతో తన కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పిన ఆయన.. తన కొడుకుకు ‘గుగన్ దాస్’ అని నామకరణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lzmFEC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...