Wednesday, 11 August 2021

ప్రేమించి మోసం చేశాడంటూ ఆర్యపై పోలీస్ కంప్లైంట్.. శ్రీలంక యువతి షాకింగ్ ఆరోపణలు! ఇష్యూ వైరల్

ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్యపై శ్రీలంకకు చెందిన ఓ యువతి షాకింగ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సదరు యువతి పోలీస్ కంప్లైంట్ చేయడంతో ఇష్యూ వైరల్ అయింది. అంతేకాదు తన దగ్గర 70 లక్షల రూపాయల నగదు కూడా తీసుకున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆ యువతి చేసిన ఆరోపణలు కొలీవుడ్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. అయితే ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం తమిళనాడులోని చెన్నె కమిషనర్‌ ఎదుట హాజరయ్యారు. పలు విషయాలపై ఆయన్ను ప్రశ్నిస్తూ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలపై పోలీసులు కూపీ లాగారు. మూడు గంటల పాటు విచారణ సాగింది. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసుపై ఆగస్టు 17వ తేదీ లోగా పూర్తి విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్యపై ఫిర్యాదు చేసిన విద్జా అనే యువతి ప్రస్తుతం జర్మనీలో ఉంటోంది. జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, ఆర్యతో చేసిన చాటింగ్ తాలూకు కీలక ఆధారాలు పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి ఆర్య విషయంలో ఈ కేసు వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కాగా, నటి సయేషా సైగల్‌ని ప్రేమించి పెళ్లాడాడు హీరో ఆర్య. 2019 మార్చి 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళ కాపురం అన్యోన్యంగా సాగుతోంది. ఇటీవలే ఈ జోడీకి పండంటి ఆడబిడ్డ జన్మించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gbRn3x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...