Wednesday, 25 August 2021

నూటొక్క జిల్లాల అందగాడు ట్రైలర్: ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది.. కడుపుబ్బా నవ్విస్తున్న అవసరాల ఫీట్స్

దర్శకుడిగా, నటుడిగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న లేటెస్ట్ మూవీ ''. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. చి.ల.సౌ ఫేమ్ హీరోయిన్‏‏గా నటిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమాపై ఆసక్తి పెంచుతూ వస్తున్న మేకర్స్.. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రీలీజ్ చేసి సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పారు. ఈ సినిమా ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా రూపొందించారని, కామెడీకి పెద్ద పీట వేశారని ఈ ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతులమీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పెళ్లి చేసుకోవాల్సిన వ‌య‌సులోని యువ‌కుడికి బ‌ట్ట‌త‌ల వ‌చ్చిన‌ప్పుడు అత‌నెలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నాడు? త‌న స‌మ‌స్య‌ను దాచి పెట్ట‌డానికి, ప్రేయ‌సి ద‌గ్గ‌ర త‌న‌కు బ‌ట్ట‌తల ఉంద‌నే నిజం తెలియ‌నీయ‌కుండా ఉండేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mAJFUn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...