Monday, 9 August 2021

‘భరతుడు’ని ఎత్తుకున్న ‘పుష్ఫ’.. పక్కపక్కనే షూటింగ్ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్

ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పుడుతుందో తెలియని వాతావరణంలో ఉంటున్నాం. అందుకే ఇలా దొరికిన సమయాన్ని మేకర్స్ ఉపయోగించుకంటూ షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ షూటింగ్‌తో రచ్చ చేస్తున్నారు. అయితే అతని ముద్దుల కూతురు అర్హ సైతం సినిమా షూటింగ్‌లో సందడి చేస్తున్నారు. శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో అర్హ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైద్రాబాద్‌లోనే జరుగుతోంది. ఈ మధ్యే బన్నీ శాకుంతలం సెట్‌లో సందడి చేశారు. ఫ్యామిలీతో సహా వెళ్లి.. అర్హ నటనను చూసి మురిసిపోయారు. స్నేహారెడ్డి, అయాన్, బన్నీ ఇలా అందరూ కూడా శాకుంతలం సెట్‌లో గడిపారు. అర్హ యాక్టింగ్‌ను చూసి ముచ్చటపడ్డారు. ఈ మేరకు బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేశాయి. తాజాగా బన్నీ మరో అప్డేట్ ఇచ్చేశారు. ఇన్ని రోజులు సుకుమార్ ఆరోగ్య పరిస్థితి కారణంగా పుష్ప షూటింగ్‌ను వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మళ్లీ పుష్ప పట్టాలెక్కింది. అయితే ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది. శాకుంతలం, పుష్ప షూటింగ్‌లు పక్కపక్కనే జరుగుతున్నాయట. అలా తండ్రీకూతుళ్లు ఇద్దరూ పక్కపక్కనే షూటింగ్ చేస్తామని అనుకున్నాను.. ఓ 15 20 ఏళ్ల తరువాత ఇలానే ఉంటుందని ఊహించాను. కానీ అది ఇంత త్వరగా వచ్చేసింది. శాకుంతలంలోని భరతుడుని పుష్ప ఇలా కలిశాడు.. ఇదెంతో అద్భుతమైన కలయిక అని బన్నీ ఎమోషనల్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VxrJiy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...