Thursday, 26 August 2021

చిన్న వయసు నుంచే అదో పిచ్చి.. పెద్ద అందగత్తె కాదని ఎగతాళి చేశారు! ఆమని ఎమోషనల్ కామెంట్స్

సినీ నటి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఆ తరం ఈ తరం అనే తేడాలేకుండా రెండు తరాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారామె. గ్లామర్ రోల్స్ చేస్తూనే ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకున్నారు. 'జంబలకిడిపంబ' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమని.. ఆ తర్వాత ''మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం'' వంటి పలు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. నేటికీ సినిమాలతో ప్రయాణం చేస్తూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యారు. నటి ఇంద్రజతో కలిసి కార్య‌క్ర‌మానికి హాజరైన ఆమని.. తన అలవాట్లు, సినీ కెరీర్‌కి సంబంధించిన పలు విషయాలపై రియాక్ట్ అయ్యారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో ఆలీతో త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా షేర్ చేసుకుంటూ కెరీర్ ఆరంభం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఆమని. తనకు ఐదేళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అని.. శ్రీదేవి, జయసుధల సినిమాలైతే అస్సలు వదిలేదే ఉండకపోయేదని చెప్పారు. జంబలకడి పంబ సినిమాలో మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఉండేటట్లు నిజజీవితంలో జరగాలి అని.. అప్పుడే ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్లకు తెలుస్తాయని అంటూ మామిడి పండ్లు దొంగతనం చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు ఆమని. అలాగే తనకు సినిమాలలో నటించాలని ఉందని తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు బంధువులు ఎగ‌తాళి చేశారని చెబుతూ ఓపెన్ అయ్యారు. ఆమె సినిమాల్లో నటించడమేంటి? అంత పెద్ద అందగత్తె కాదు కదా అని కామెంట్స్ చేశారని ఆమని చెప్పుకొచ్చారు. ఫుల్ ఎపిసోడ్ వస్తే ఇంకా ఆమె ఏయే విషయాలపై స్పందించారో తెలుస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jho8xS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...