Saturday, 14 August 2021

కత్తి మహేష్ మరణంపై పృథ్వి రాజ్ షాకింగ్ కామెంట్స్.. డ్రైవర్ ఎందుకలా..? మతలబు ఉందంటూ సెన్సేషన్

సినీ నటుడు, క్రిటిక్ మరణవార్త సినీ వర్గాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి చిత్తూరు వెళ్తున్న క్రమంలో నెల్లూరు దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో తీవ్ర గాయాలపాలై చివరికి వరకు చావుతో పోరాడి ఓడిపోయారు. త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని అంతా అనుకుంటున్న తరుణంలో కన్నుమూశారు. అయితే మొదటినుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆయన మరణం సినీ లోకంలో చర్చనీయాంశం అయింది. పలు రకాల చర్చలకు దారి తీసింది. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మరణంపై మరో నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ బాగా పాపులర్ అయిన పృథ్వి రాజ్.. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పారు. వైఎస్ జగన్ పార్టీలో చేరి గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో కొన్ని చోట్ల ప్రచారాలకు వెళ్ళినప్పుడు తన వెంట కత్తి మహేష్ కూడా వచ్చారని చెబుతూ.. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు పృథ్వి రాజ్. విషయంలో తనకు చాలా అనుమానాలున్నాయని, దీని వెనుక ఏదో మతలబు ఉందని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు పృథ్వి రాజ్. ఎదురుగా ఉన్న వెహికిల్‌ని ఢీ కొట్టినా ఆ కారు తోలుతున్న డ్రైవర్‌కి ఎలాంటి మేజర్ గాయాలు కాకుండా కేవలం కత్తి మహేష్ అంతలా గాయపడి కన్నుమూయడం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. తాను గనుక ఓ పోలీస్ ఆఫీసర్ అయిఉంటే కచ్చితంగా ఈ కేసు టేకప్ చేసి అసలు దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి అనే విషయం తెలుసుకునే వాడినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని చెప్పిన పృథ్వి.. ఈ మేరకు కత్తి మహేష్ వ్యక్తిత్వంపై కూడా ఓపెన్ అయ్యారు. తాను లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో కూడా తనకు మోరల్ సపోర్ట్‌గా నిలిచింది ఒక్క కత్తి మహేష్ మాత్రమే అని అన్నారు. ఎవ్వరూ ఫోన్ చేయని ఆ టైంలో కూడా కత్తి మహేష్ ఫోన్ చేసి తనకు అండగా నిలబడ్డాడనని, నిజంగా ఒక స్నేహితుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు పృథ్వి రాజ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3COaOZx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...