తెలుగు సినిమా పాటల్లో జానపదం పాటలకు ఉంటే గుర్తింపే వేరు. జానపదంలో ఎలాంటి సినిమా పాటలు వచ్చినా.. వాటిని అదరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందు ఉంటారు. వారికి జానపదంపై ఉండే మమకారం అలాంటిది. రీసెంట్‌గా వచ్చినా.. ‘సారంగ దరియా’ పాటని కూడా ప్రేక్షకులు ఏ రేంజ్‌లో హిట్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఒక సినిమా మొత్తం ఆటవిక జీవనంపై రూపొందుతూ.. ఆ సినిమా నుంచి ఓ పాట విడుదల అయితే.. ప్రేక్షకులు ఏ రేంజ్‌లో రెస్పాండ్ అవుతారో మనందరికి తెలిసిందే. ఆ సినిమానే ‘కొండ పొలం’. క్రియేటియ్ డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ సింగ్ ఆయనతో రొమాన్స్ చేస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా నుంచి రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్‌ని రివీల్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఆమె పాత్ర ‘ఓబులమ్మ’ అని.. ఆమె ఓ గొర్ల కాపరి అంటూ వాళ్లు తెలిపారు. అచ్చమైన పల్లెటూరి గొర్ల కాపరి పాత్రలో రకుల్ ప్రీత్ ఒదిగిపోయింది అనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చింది. చిత్రంలో నుంచి ‘ఓబులమ్మ’ పాటని లేటెస్ట్‌గా విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఓ..ఓ..ఓబులమ్మా.. బొమ్మ కళ్ల.. మేనిఛాయ ముద్దుగుమ్మ’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాట ఆరంభంలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా రకుల్ ప్రీత్.. తిరగలి విసురుతూ పాడిన లీడ్ కూడా ఆసక్తికరంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పాట అభిమానులను విశేషంగా అలరిస్తుంది. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mELYWI
v
No comments:
Post a Comment