Tuesday, 10 August 2021

సాయం కోరిన యువరైతు.. వెంటనే డబ్బులు పంపిన నిర్మాత.. మెగా ఫ్యాన్స్ ప్రశంసలు!

మెగా ఫ్యాన్ అనే ట్యాగ్ నుంచి కో ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగారు ఎస్.కే. ఎన్ (). సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఎస్.కే. ఎన్ మెగా హీరోల గురించి పోస్ట్‌లు పెడుతుంటారు. ఇక మెగా హీరోల మీద వచ్చే ట్రోలింగ్‌పైనా ఘాటుగా రియాక్ట్ అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎస్.కే. ఎన్ మీద సైతం ట్రోలింగ్ జరుగుతుంటుంది. సినిమా అప్డేట్లలో ఎస్.కే. ఎన్ ముందుంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన విషయాలను చెబుతుంటారు. అలాంటి ఎస్.కే. ఎన్ తాజాగా ఓ యువరైతుకు సాయమందించారు. ఆ రైతు తన కష్టాలను చెప్పుకుంటూ.. ట్వీట్ వేశాడు. కౌలుకు తీసుకున్నాను.. ఒక్కసారి పొలాన్ని దున్నించాను.. ఇంకోసారి దున్నించాలంటే ఏడు వేలు అవుతుంది.. ట్రాక్టర్ కిరాయికి డబ్బులు లేవు.. తెలిసిన వాళ్లు ఎవ్వరూ కూడా ఇవ్వడం లేదు అన్నా.. పీకే అన్న ఫ్యాన్స్ అంటూ అందరినీ వేడుకున్నాడు సదరు రైతు. తన నంబర్‌ను కూడా షేర్ చేసి.. ఆర్థిక సాయం చేయమని కోరాడు. ఇక ఆ ట్వీట్‌కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇంతలోపు ఎస్.కే. ఎన్ స్పందించి.. సదరు రైతుకు కావాల్సిన మొత్తాన్ని గూగుల్ పే చేసేశారు. అలా ఎస్.కే. ఎన్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగాఫ్యాన్స్ అంటే అలా ఉంటారు అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజుల్లో, టాక్సివాలా వంటి సినిమాలకు ఎస్.కే. ఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రతిరోజూ పండుగే, మహానుభావుడు, పక్కా కమర్షియల్ వంటి సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Am9tHA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...