Thursday, 12 August 2021

పుష్పతో పోటీకి రెడీ అవుతున్న అమీర్‌ఖాన్.. ఎంత త్వరగా అయితే అంత మంచిది అంటూ..

బాలీవుడ్‌లో విభిన్నమైన సినిమాలు చేయడం అంటే అమీర్‌ఖాన్ ఎప్పుడూ ముందుంటారు. ఆయన సినిమా అంటే అందులో ఎదో ఒక విలక్షణత కచ్చితంగా ఉంటుంది. సినిమా కోసం ఎంత కష్టపడటానికి అయినా ఆయన వెనుకాడరు. అది బరుపు పెరగడం కావొచ్చు లేదా ఇంకేదైనా అంశం కావొచ్చు. ఇలా ఏం చేసేందుకు అయినా సిద్ధంగా ఉంటారు అమీర్. అందుకే అందరూ ఆయన్ని మిస్టర్ పర్‌ఫెక్ట్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్ధా’. 1994లో హాలీవుడ్‌లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి చిత్రానికి ఇది రీమేక్. అద్వైత్ చందన్ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు నాగచైతన్య ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక షారుఖ్‌ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు కాస్త అంతరాయం ఏర్పడింది. అయితే కొద్ది రోజులుగా కేసులు తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించి.. నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉంది. తాజాగా తన సినిమా విడుదలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదని.. కచ్చితంగా థియేటర్‌లలోనే విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను సినిమాలను గౌరవించే వ్యక్తినని.. భవిష్యత్తులో పరిస్థితులు మెరుగుపడాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. సినిమా హాల్స్ పూర్తిస్థాయిలో ఎప్పుడు తెరుచుకుంటాయో ఇప్పుడే చెప్పలేమని.. అయితే ఎక్కువ శాతం మంది ప్రజలు ఎంత త్వరగా టీకాలు తీసుకుంటే.. అంత త్వరగా సినిమా హాల్స్ తెరుచుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే అనుకున్న సమయానికి విడుదల అయితే ఈ సినిమా అల్లు అర్జున్ నటిస్తున్న ‘’ సినిమాతో పోటీ పడనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CD5RD7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...