Saturday, 28 August 2021

Bigg Boss 5: అలజడి రేపుతున్న కరోనా.. ఇద్దరికి పాజిటివ్.. కీలక మార్పులు

బుల్లితెరపై సూపర్‌హిట్‌ అయిన రియాల్టీ షోలలో ముందు వరుసలో ఉంటుంది. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లో కూడా ప్రారంభమైంది. తెలుగులో ఈ షోకి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ షోకి సంబంధించిన టీజర్‌ కూడా విడుదల అయింది. ఈ టీజర్‌లో హోస్ట్ అక్కినేని ‘గన్‌’ పట్టుకొని మీ బోర్‌కి ఇక గుడ్‌బై చెప్పండి అంటూ అదరగొట్టారు. ఈ షో ఛాన‌ల్‌లో ఈ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి గ్రాండ్‌గా ప్రారంభం అయి.. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఇప్పటికే ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టంట్స్ ఇప్పటికే క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే ఆ కంటెస్టంట్స్ వీరే అంటూ కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారు.. యాంకర్‌ రవి, లోబో, కార్తీకదీపం ఉమాదేవి, లహరి షారి, యాంకర్‌ ప్రత్యూష, యానీ మాస్టర్, సిరి హన్మంత్‌, ప్రియాంక, నటి ప్రియ, నవ్య స్వామి, 7 ఆర్ట్స్ సరయు, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, సింగర్ కోమలి, వర్షిణి, ఆట సందీప్ భార్య జ్యోతిలు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓ వార్త అభిమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. అయితే ఓ ఇద్దరు కంటెస్టెంట్లకు సోకడంతో వాళ్లకు షో నుంచి తొలగింది. మరో ఇద్దరు కంటెస్టంట్లు సిద్ధం చేశారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వాళ్లు కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, సింగర్‌ శ్రీరామచంద్ర అని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే షో ప్రసారం అయ్యే వరకూ ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mO6i7M
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...