Wednesday, 25 August 2021

Bangarraju : బుల్లెట్టు బండి, మల్లెపూల దండలు.. చైతూ, నాగ్‌ల జోరు మామూలుగా లేదు

సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఆడిన సరసాలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ చిత్రం అంతగా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఆ బంగార్రాజు పాత్రే. అందుకే ఆ పాత్రను మెయిన్ లీడ్‌గా పెట్టి.. అదే టైటిల్‌ను ఫిక్స్ చేసి అలరించేందుకు మళ్లీ వచ్చేస్తున్నారు. అయితే ఈ బంగార్రాజు మాత్రం సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ కాదు.. ప్రీ క్వెల్ కాదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే సోగ్గాడే చిన్నినాయనకు కాస్త లింక్ ఉంటుందని, అందుకే ఆ చిత్రంలోని కొన్ని సీన్లను వాడుకుంటారట. ఈ మధ్యే ఈ మూవీ యూనిట్ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో నాగార్జున, నాగ చైతన్యలు పాల్గొన్నారు. హీరోయిన్ కృతి శెట్టి సైతం కనిపించింది. అయితే నేడు ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన నాగార్జున వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ బంగార్రాజు మూవీలో చాలా ముఖ్యమైన ప్రాపర్టీలను చూపించారు. బంగార్రాజు ఎక్కువగా బుల్లెట్టు బండి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కర్రపట్టుకుని కనిపిస్తుంటాడు. ఇక మల్లెపూలు మాత్రం లేనిదే ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడేమో. అలా బుల్లెట్టు బండికే మల్లెపూల దండను చుట్టేశారు. , నాగార్జునలు ఇద్దరూ కూడా బుల్లెట్టు బండి ఎక్కి షికార్లకు వెళ్తుంటారేమో. మొత్తానికి కళ్యాణ్ కృష్ణ ఈ సారి కూడా మ్యాజిక్ చేసేందకు రెడీ అయినట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DkH4nk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...