Sunday, 29 August 2021

Allu Arjun : అది చూపించమని ఒకరు.. ప్రపోజ్ చేస్తూ మరొకరు.. హన్సికకు వింత అనుభవం!

కాశ్మీర్ యాపిల్ వంటి రంగుతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేశారు హన్సిక. మొదటి చిత్రం దేశ ముదురుతోనే టాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయారు. హీరోగా వచ్చిన ఆ సినిమాతో ఇక్కడి హీరోలకు హాట్ ఫేవరేట్‌గా మారిపోయారు. కొంత కాలం వరుస ప్రాజెక్ట్‌లతో ఇక్కడ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఇతర భాషల మీద హన్సిక కన్నేశారు. అలా కోలీవుడ్, బాలీవుడ్ అంటూ హన్సిక ఫుల్ బిజీగా మారిపోయారు. చాలా రోజులు తరువాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హన్సిక రెడీ అవుతున్నారు. తెనాలి రామకృష్ణ అంటూ సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హన్సిక మళ్లీ గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు హన్సిక లేడీ ఓరియెంటెడ్ చిత్రాల మీద కన్నేసినట్టు కనిపిస్తోంది. మై నేమ్ ఈజ్ శ్రుతీ, 105 మినిట్స్ అంటూ తెలుగులో హన్సిక ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్న హన్సిక.. షూట్ గ్యాప్‌లో తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేసేశారు. ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఓ నెటిజన్ అడిగితే.. తల అడ్డంగా ఊపేశారు హన్సిక. నీ నెయిల్స్ (గోర్లు) చూపించమని మరో నెటిజన్ అడిగితే.. హన్సిక చూపించేశారు. ఎక్కడున్నారు అని ఇంకో నెటిజన్ అడిగితే.. హైద్రాబాద్‌లోనే ఉన్నాను అని చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ గురించి చెప్పమని అడిగితే ఓ లిస్టే చెప్పేశారు హన్సిక. స్వీట్,కైండ్, ఫన్నీ.. నా మొదటి హీరో అంటూ బన్నీ గురించి హన్సిక చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kzvHPZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...