Saturday, 28 August 2021

Adipurush: ‘మా జంట బాగుంటుంది’.. ప్రభాస్ ఎలాంటి వాడో చెప్పిన కృతి సనన్

‘బాహుబలి’ ఈ సినిమా తర్వాత రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమాలో నటించారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోనా.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. దర్శకత్వంలో రూపొందుతున్న ‘’. రామాయణ మహాగాధ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా రాముడిగా నటిస్తుండగా, సీతగా నటించబోతోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, ప్రభాస్‌తో తలపడబోయే రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటి కాజోల్ నటిస్తున్నారు. అయితే ఆమె పాత్ర ఏంటీ అనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఇక హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఈ సినిమాలో ప్రభాస్‌తో నటించిన అనుభవాన్ని పంచుకుంది. ప్రభాస్‌తో కలిసి నటించడం.. అదీ సీత పాత్రలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అని ఆమె పేర్కొన్నారు. ప్రభాస్ చాలా పొడవుగా ఉంటాడు కాబట్టి ప్రొఫెషనల్ దుస్తుల్లో ఉన్నప్పుడు తమ జంట ఎంతో బాగుంటుంది అంటూ కృతి చెప్పింది. ‘మొదటి షెడ్యూల్‌లో తొలిసారి ప్రభాస్‌తో షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు అతనితో మరో షెడ్యూల్‌ చేయబోతున్నాను. అతను చాలా సరదా వ్యక్తి. మంచివాడు. భోజన ప్రియుడు.. అతనికి చాలా బిడయం అని అంతా అంటారు.. కానీ, అది నిజం కాదు.. ఒకసారి పరిచయం అయితే అతను ఎంతో బాగా మాట్లాడుతాడు. అతనితో స్నేహం నాకు ఎంతో నచ్చింది’ అంటూ కృతి పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WztkEn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...