Thursday, 29 July 2021

Vakeel saab TRP Ratings: తక్కువే కానీ ఇదే ఎక్కువ!

పవర్ స్టార్ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది వెండితెర అయినా బుల్లితెర అయినా పవన్ కళ్యాణ్ అడుగుపెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. గ్యాప్ తరువాత అంటూ థియేటర్ల మీద దాడి చేశారు. కరోనా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. చివరకు సెకండ్ వేవ్ ఎక్కువ తీవ్రతరం అవ్వడంతో థియేటర్లు మూసేశారు. లేదంటే వకీల్ సాబ్ రచ్చ ఇంకా కొనసాగేది. అలా థియేటర్లలో వకీల్ సాబ్ తన సత్తా చూపించారు. అయితే బుల్లితెరపై వకీల్ సాబ్ గత ఆదివారం సందడి చేశారు. ఈ క్రమంలో జీ తెలుగు భారీ రేటుకు వకీల్ సాబ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి సారి వకీల్ సాబ్‌ను చానెల్‌లో ప్రసారం చేస్తుండటంతో భారీ ఎత్తున ప్రచారం చేశారు. భారీ ఫ్లెక్సులు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. కొత్త సినిమా థియేటర్లో వస్తే ఎలా ఉంటుందో.. వకీల్ సాబ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అలాంటి సందడిని క్రియేట్ చేశారు. టీవీలో వకీల్ సాబ్ వస్తోందని తెగ ప్రచారం చేసేశారు. దానికి తగ్గట్టే భారీ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వకీల్ సాబ్ 19.12 రేటింగ్ సాధించేసింది. అయితే ఇది చాలా తక్కువే. మామూలుగా కొత్త సినిమాలు ఇలా టీవీల్లో వస్తే.. పెద్ద హీరోలకు 20కి పైనే రేటింగ్ వస్తుంది. ఆ లెక్కన చూస్తే ఇది చాలా తక్కువే. కానీ కొన్ని లెక్కలను పరిశీలిస్తే ఇదే ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఇంతటి టీఆర్పీ సాధించిన చిత్రం మరొకటి లేదు. ఈ ఏడాది బహుషా ఇప్పటి వరకు ఇదే అత్యధిక టీఆర్పీ అని తెలుస్తోంది. ఇక జీ తెలుగు హిస్టరీలోనే ఇంతటి టీఆర్పీ సాధించిన నాల్గో సినిమాగా వకీల్ సాబ్ రికార్డ్ క్రియేట్ చేసింది. జీ తెలుగుకు ఉన్న రీచ్ ప్రకారం వకీల్ సాబ్ 19.12 రేటింగ్ సాధించడం గొప్ప విషయమే. అదే గనుక స్టార్ మా వాడికి ఇచ్చి ఉంటే 24, 25 స్థాయిలో రేటింగ్ రాబట్టి ఉండేదని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2URQANL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...