Wednesday, 28 July 2021

SR కళ్యాణమండపం ట్రైలర్: యూత్‌ని అట్రాక్ట్ చేసే సీన్స్.. ప్రియాంక స్పెషల్ అట్రాక్షన్

'రాజావారు రాణివారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా ''. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. చిత్రంలో 'టాక్సీవాలా' బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 40 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో సాయి కుమార్ ఎమోషనల్ సీన్స్, హీరోయిన్ ప్రియాంకతో హీరో కామెడీ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా అన్ని అంశాలు కలగలుపుతూ ఈ ట్రైలర్ కట్ చేశారని వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. ప్రియాంక జవల్కర్ అప్పియరెన్స్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. హీరో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ స్కిల్ బయటపడిందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 6వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలకు రెక్కలు కట్టింది. థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి SR కళ్యాణమండపం అన్ని రకాల వినోదం పంచుతుందని తెలిపింది ఈ ట్రైలర్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను శంక‌ర్ పిక్చ‌ర్స్‌ సంస్థ సొంతం చేసుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BNj37O
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...