Wednesday, 7 July 2021

Sixth Sense 4 : బండ్లన్నతో నీళ్లు తాగించిన ఓంకార్ అన్నయ్య.. మాంచి రసవత్తరంగా సాగనున్న షో!

బండ్ల గణేష్‌కు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును సాధించారు. ఇక మధ్యలో రాజకీయ ప్రయాణం కూడా చేశారు.కానీ అది కత్తి మీద సాము అని గ్రహించి అక్కడి నుంచి శాశ్వతంగా వచ్చేశారు. ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టేశారు . ఇక సోషల్ మీడియాలో బండ్ల గణేష్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ వీరాభిమాని కాదు కాదు వీర భక్తుడిగా బండ్ల గణేష్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిత్యం బండ్లన్న మీద ఓ కన్నేసి ఉంచుతారు. ఎప్పుడు ఎలాంటి ట్వీట్లు వేస్తాడో.. పవన్ కళ్యాణ్‌ను ఎలా కీర్తిస్తాడో అంటూ పవర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తుంటారు. పవన్ కళ్యాణ్ మీద బండ్లన్న వేసే ట్వీట్లు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటారు. ఈ మధ్య దేవర అంటూ పవన్ కళ్యాణ్‌కు కొత్త పేరు పెట్టేశారు. నా దేవుడు అని పిలిచే బండ్లన్న దేవర అని పిలవడం మొదలుపెట్టేశారు. దానికి కారణం కూడా చెప్పేశారు. భక్త కన్నప్ప శివుడిని దేవర అని పిలిచేవాడని అందుకే ఇకపై తాను కూడా అలానే పిలుస్తానని బండ్ల గణేష్ తెలిపారు. అలాంటి బండ్లన్న ఓంకార్ షోకు రాబోతోన్నారు. ఈ మేరకు వదిలిన ప్రోమో సోషల్ మీడియాను ఊపేసింది. అందులో బండ్లన్న కొట్టిన డైలాగ్‌లు, పవన్ కళ్యాణ్ మీద చాటిన ప్రేమ బాగానే వైరల్ అయింది. ఇక తన కూతురిని కూడా తెర మీదే అందరికీ పరిచయం చేశారు. అయితే షో అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వన్ సెకన్ అంటూ సిక్స్త్ సెన్స్‌లో టెన్షన్ పెట్టే తీరు అందరికీ తెలిసిందే. అలా ఈసారి బండ్ల గణేష్‌ను కూడా ఓంకార్ అన్నయ్య ఆడేసుకున్నారు. దెబ్బకు ఆ టెన్షన్‌తో వాటర్ బాటిల్ అడిగేశారు బండ్ల గణేష్. ఈ ప్రపంచంలో నాతో ఎవ్వరూ కూడా నీళ్లు తాగించలేదు.. కానీ నువ్ తాగించావ్ అని ఓంకార్‌ను ఉద్దేశించి బండ్ల గణేష్ అన్నారు. ఇక నందిత, బాబా భాస్కర్ ఇలా అందరూ కలిసి ఈ వారం ఎపిసోడ్‌ను హిట్ చేసేలానే కనిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wpQFoe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...