Monday, 26 July 2021

Shalini Kandukuri : మిగిలిన జీవితమంతా కూడా నీతోనే గడపాలి.. నితిన్ కామెంట్స్ వైరల్

తన పెళ్లిని ఎంతో గ్రాండ్‌గా చేసుకోవాలని అనుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ దుబాయ్‌లో భారీగా ప్లాన్ చేశారు. కానీ కరోనా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కరోనా రాకతో ఎంతో మంది ప్లాన్స్ బెడిసికొట్టాయి.అందులో నితిన్ పెళ్లికూడా ఉంది. దుబాయ్‌లో పెళ్లి ఏర్పాట్లకు అప్పటికే చాలా ఖర్చు పెట్టేశారు. కానీ కరోనా ఎంతకీ తగ్గకపోవడం, పరిస్థితులు చక్కబడేలా లేవని గమనించిన నితిన్ హైద్రాబాద్‌లోనే చివరకు మూడు ముళ్లు వేసేశారు. అతి తక్కువ మంది బంధుమిత్రలు సమక్షంలో తన స్నేహితురాలు, ప్రియురాలు అయిన శాలిని మెడలో మూడు ముళ్లు వేశారు నితిన్. అలా గత ఏడాది జూలై 26న ఈ జంట ఒక్కటైంది. నితిన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక తన బ్యాచ్‌లర్ జీవితానికి ముగింపు వచ్చేసిందంటూ నితిన్ షేర్ చేసిన ఫోటోలు బాగానే హల్చల్ చేశాయి. అలా నితిన్ సంసారం జీవితం సాఫీగా సాగుతూ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ మేరకు నితిన్ తమ ఈ ఏడాది కాలాన్ని గుర్తు చేసుకుంటూ వివాహా దినోత్సవ సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేశారు. హ్యాపీ యానివర్సరీ.. నా మిగిలిన జీవితం మొత్తం నీతోనే గడపాలని కోరుకుంటున్నాను... నా జీవితాన్ని ఇంత సులభతరం, ఇంత గొప్పగా, ఇంత సంతోషంగా చేసినందుకు థ్యాంక్స్ అని భార్య షాలినికి ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేశారు. మరో వైపు షాలినీ తన భర్తపై ప్రేమను కురిపించారు. ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వో అద్భుతానివి నితిన్ అని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kUSk34
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...