రేణూ దేశాయ్, ఆమె కుటుంబంతో ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. పిల్లలు , అకీరాలతో అడివి శేష్ ఓ స్నేహితుడిలా కలిసి పోతుంటారు. వీరి బంధం పంజా సినిమా షూటింగ్ సమయంలో ఇంతగా బలపడి ఉంటుందేమో. ఇక అడివి శేష్, అకీరాలు బాస్కెట్ బాల్ ఆడుతుంటారట. బాస్కెట్ బాల్ ఆడేందుకు ఎప్పుడు వస్తారని అడివి శేష్ గురించి రేణూ దేశాయ్‌ను అకీరా అడుగుతుంటారట. ఇక ఆ మధ్య అడివి శేష్ గురించి అకీరా స్పెషల్‌గా మాస్కులు తయారు చేసి పంపించిన విషయం తెలిసిందే. అకీరా, అడివి శేష్‌లు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అలా ఎక్కువగా అకీరాతో కలవడంతో సినీ ఎంట్రీ గురించి అడివి శేష్ ప్రయత్నిస్తున్నారేమో, మేజర్ సినిమాలో ఏదైనా స్పెషల్ రోల్ ఇస్తున్నారేమోనని రూమర్లు వచ్చాయి. ఇక అడివి శేష్ కూడా తన ఫ్యామిలీతో ఎక్కువ సన్నిహితంగా ఉండటం చూసి కొందరు రకరకాలుగా కామెంట్లు చేశారు. అడివి శేష్‌కు మీకూ ఉన్న రిలేషన్ ఏంటి? అని రేణూ దేశాయ్‌ని ఎన్నో సార్లు నెటిజన్లు ప్రశ్నించారు. అకీరా, ఆద్యలకు అడివి శేష్ అన్న అవుతాడని చెబుతుంటే మళ్లీ మీరు ఇలా అడుగుతారేంటని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తాజాగా రేణూ దేశాయ్, అడివి శేష్‌ల మధ్య జరిగిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆద్య చేసే రుచికరమైన ఐస్ క్రీమ్‌ను తినేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాను అని రేణూ దేశాయ్‌కి ట్యాగ్ చేశారు అడివి శేష్. అంతే కాకుండా ఆద్య.. ఆ దేవుడు ఇచ్చిన బహుమతి అని పొగిడేశారు. నువ్ ఆమెకు ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైన అన్నయ్యవి కదా?.. నువ్ ఇలా బుజ్జగించాల్సిన పని లేదు అని రేణూ దేశాయ్ రిప్లై ఇచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SVxDZu
v
No comments:
Post a Comment