Sunday, 4 July 2021

NKR21 : చరిత్రలో లిఖించని అధ్యాయం.. కళ్యాణ్ రామ్ ప్లానింగ్ అదుర్స్

కొత్త సినిమా అప్డేట్లతో రచ్చ చేసేందుకు రెడీగా ఉన్నారు. సరైన సక్సెస్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ సారి మాత్రం వరుసగా ప్రాజెక్ట్‌లను రెడీ చేశారు. ఐదారు ప్రాజెక్ట్‌లతో కళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. మరి కొన్ని అప్డేట్లు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలో గత నెలలో వచ్చిన బింబిసార అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొత్త సినిమాల లిస్ట్ మొత్తం హల్చల్ చేస్తోంది. 18వ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. అదే బింబిసార సినిమా. ఇక 19వ సినిమా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రానుంది. ఇక 20వ చిత్రం దిల్ రాజు నిర్మించబోతోన్నారట. తాజాగా 21వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. రేపు (జూలై 5) కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా 21వ ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతోంది. ఈమేరకు చిన్న హింట్ ఇచ్చారు. ప్రీ లుక్, పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అభిషేక్ నామా నిర్మాతగా రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రానుంది. చరిత్రలో లిఖించని అధ్యాయం అంటూ ఏదో కొత్త కాన్సెప్ట్‌తోనే కళ్యాణ్ రామ్ రాబోతోన్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ 22వ ప్రాజెక్ట్‌ను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా నిర్మాతగానూ రచ్చ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SNmda7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...