Sunday, 4 July 2021

నగ్న ఫోటోతో షాకిచ్చిన డైరెక్టర్.. రాహుల్ రవీంద్రన్ పిక్ వైరల్

హీరోగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగానూ సత్తా చాటుకున్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు దగ్గరయ్యారు. లవర్ బాయ్ పాత్రలతో రాహుల్ ఇక్కడి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. కానీ రాహుల్‌కు మాత్రం హీరోగా అంత గుర్తింపు రాలేదు. చివరకు కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ఇక అక్కడి నుంచి రాహుల్ కొత్త అవతారాన్ని ఎత్తారు. దర్శకుడిగా మారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అలా మొదటి సారిగా చిలసౌ సినిమాతో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారిపోయారు. అయితే ఫస్ట్ చిత్రమే మంచి సక్సెస్ సాధించడంతో పెద్ద హీరోల దృష్టిలో పడ్దారు. అలా కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశారు. కానీ మన్మథుడు 2 చిత్రం బోల్తా కొట్టడంతో రాహుల్ కెరీర్ మళ్లీ వెనక్కి వెళ్లినట్టు అయింది. ఇప్పుడు రాహుల్ చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌లేమీ లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ పేరు ఎప్పుడూ కూడా మార్మోగిపోతూనే ఉంటుంది. చిన్మయిని ట్రోల్ చేసే వారంతా కూడా రాహుల్‌ను మధ్యలోకి లాగుతుంటారు. అలా రాహుల్ మీదా లెక్కలేనంత ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ రాహుల్ మాత్రం అలాంటి వాటిని ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. పైగా చేసేది కరెక్ట్ అంటూ ఆమెకు తోడుగా ఉంటారు. అలాంటి రాహుల్ తాజాగా ఓ ఫోటో షేర్ చేశారు. నగ్న ఫోటోను షేర్ చేస్తూ ఇదే నా కెరీర్‌లో బోల్డెస్ట్ ఫోటో షూట్ అంటూ చిన్నతనంలో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక బాల్యంలో అలా దిగంబరుడిగా మారి దిగిన ఫోటో ఇప్పుడు షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. నెట్టింట్లో రాహుల్ నగ్న ఫోటో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UlIpZo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...